హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, మాదాపూరేనా అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఫైనాన్షియల్ సిటీ అంటూ ఉన్న డబ్బులన్నీ ప్రభుత్వం అక్కడే ఖర్చు పెడుతోందని, ఫ్లైఓవర్ల మీద ఫ్లైఓవర్లు, రోడ్లు వేస్తూ మిగతా ఏరియాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిజమైన హైదరాబాద్ కు అన్యాయం జరుగుతోందన్న ఆయన డ్రైనేజీలు, కాల్వల్లో పూడిక తీయకపోవడం వల్ల అవి మూసుకుపోయి నీరంతా రోడ్లపైకి వచ్చిందన్నారు.
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడ, కృష్ణానగర్ లో పర్యటించిన కిషన్ రెడ్డి అక్కడి ఇబ్బందుల్ని గమనించారు. రోడ్లపై నిలిచిన నీటిలో తిరుగుతూ ఉన్నతాధికారులతో మాట్లాడారు. పరిస్థితి దారుణంగా ఉందని, తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.