కొన్ని దేశాల్లో భారీ వర్షాలతో వరదలు… మరికొన్ని దేశాల్లో భగభగమండే ఎండలు.. ఇలా విభిన్న వాతావరణంతో ప్రపంచం హడలెత్తిపోతోంది. రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతుండటంపై మానవాళి మనుగడనే ప్రశ్నార్థకంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. మానవ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత లక్ష ఏళ్లలో చూడని విధంగా ఈ జులైలో వరల్డ్ టెంపరేచర్స్ ఉన్నాయని తెలిపారు. ఫ్యూచర్ మరింత దారుణంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఏడాది హయ్యెస్ట్ ఉష్ణోగ్రతలు రికార్డయిన నెలగా జులై చరిత్ర సృష్టించింది. 2019లో నమోదైన రికార్డులు ఈ నెలతో తుడిచిపెట్టుకుపోయాయని యూరోపియన్ యూనియన్(EU)కు చెందిన ‘కోపర్నికస్ క్లైమెట్ ఛేంజ్ సర్వీస్’ సైంటిస్టులు రిపోర్టు తయారు చేశారు. లక్ష సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వాతావరణం గత 3 వారాల్లోనే నమోదైందని స్పష్టం చేసింది. వరల్డ్ వైడ్ గా గాలుల తీవ్రతను స్టడీ చేసి ఈ నిర్ణయానికి వచ్చామన్నారు.
జులై తొలి మూడు వారాల్లో యావరేజ్ గా 16.95 డిగ్రీలు నమోదు కాగా.. 2019 జులైలో నమోదైన 16.93 కంటే ఇది ఎక్కువని రిపోర్టు తెలిపింది. 1940 నుంచి ఈ డేటాను కవర్ చేస్తున్నట్లు సైంటిస్టులు తెలిపారు. ఉత్తరార్ధ గోళంలో ఎన్నడూ లేని ఎండలు ఉన్నాయని, అమెరికా వంటి కొన్ని దేశాల్లో 50 డిగ్రీలు దాటిందని వివరించారు. చరిత్రలోనే హయ్యెస్ట్ టెంపరేచర్ ఈ నెల 6న నమోదైందని, వరల్డ్ యావరేజ్ 17.08 డిగ్రీలుగా ఉందని ఇది చరిత్రలోనే అత్యధికమని తెలిపింది.
సముద్ర వాతావరణంలో భారీ మార్పులు జరుగుతున్నాయని, రానున్న రోజుల్లో ఈ వేడి మరింత పెరిగి తీర ప్రాంతాలు అందులో కలిసిపోతాయని రిపోర్టులో వివరించారు. భూమి విధ్వంసపు స్థితికి చేరుకుందని, ‘గ్లోబల్ వార్మింగ్’ శకం ముగిసి ‘గ్లోబల్ బాయిలింగ్’ శకం మొదలైందని UNO హెచ్చరించింది. పొల్యూషన్ ను తగ్గించే చర్యలు చేపట్టకపోతే ప్రపంచ భవిష్యత్తు అంధకారమేనని సైంటిస్టుల టీమ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.