ఇంగ్లండ్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న సంతోషంలో ఉన్న ఆస్ట్రేలియాను ఎదురుదెబ్బ తీసింది స్టోక్స్ సేన. ప్రత్యర్థిని 283 పరుగులకు ఆలౌట్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో 295 పరుగులకే చాప చుట్టేసింది. కేవలం 12 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని కంగారూ జట్టు సాధించింది. 61/1తో రెండో రోజు బ్యాటింగ్ కంటిన్యూ చేసిన ఆస్ట్రేలియా.. స్మిత్(71; 123 బంతుల్లో 6×4) ఒంటరి పోరాటంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఖవాజా(47), వార్నర్(24), లబుషేన్(9), ట్రావిస్ హెడ్(4), మార్ష్(16), క్యారీ(10) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఖవాజా, కమిన్స్ తోడుగా స్మిత్ ఇంగ్లీష్ బౌలర్లను తట్టుకుని నిలబడ్డాడు.
స్మిత్, కమిన్స్ జంట ఎనిమిదో వికెట్ కు 94 బంతుల్లో 50 పరుగులు జోడించింది. 185 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును ఈ జోడీ ఆదుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్(3/61), జో రూట్(2/20), స్టూవర్ట్ బ్రాడ్(2/49), మార్క్ వుడ్(2/62), జేమ్స్ అండర్సన్(1/67) వికెట్లు తీసుకున్నారు.