
ప్రజలు వరదలతో అల్లాడుతుంటే కేటీఆర్ పార్టీల్లో మునిగిపోయారని, సహాయక చర్యల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. KCR, KTRకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదని, పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని ఆయన ఫైర్ అయ్యారు. వర్షాలతో 30 మంది మృతిచెందినా KCR పరామర్శించలేదని, ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదన్నారు. రా జకీయాలపై ఉన్న శ్రద్ధ బాధితులపై లేకుండా పోయిందని, వారి బాధలు పట్టించుకునే తీరిక లేదా అని రేవంత్ ప్రశ్నించారు.
ముందస్తు వార్నింగ్ ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని, దీనిపై పార్లమెంటులో నితిన్ గడ్కరీకి వివరిస్తామన్నారు. తక్షణం వరద సాయం కింద రూ.1000 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని రేవంత్ డిమాండ్ చేశారు. ఇందుకు కిషన్ రెడ్డి చొరవ, బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు.