డిజాస్టర్ ఫండ్ కింద రూ.3 లక్షలు కేంద్రం, మరో రూ.లక్ష రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని.. వరదల్లో మృతి చెందిన వారికి ఆ నిధులు అందుతాయని కేంద్ర మంత్రి, BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన… బాధిత కుటుంబాల్ని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద విపత్తు నిధులు రూ.800 నుంచి రూ.900 కోట్లు ఉన్నాయని, ఇందులో కేంద్రం వాటా 75 శాతం, రాష్ట్ర వాటా 25 శాతం ఉందని ఆ నిధుల్ని పూర్తిగా ఖర్చు పెట్టాలన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన.. తీవ్ర తాకిడికి గురైన మోరంచపల్లికి వెళ్లారు. రాజకీయాలు చేసేందుకు రాలేదన్న కిషన్ రెడ్డి.. ఎవరికి తోచిన సహాయం వారు అందించాలని ప్రజలను కోరారు.