మండలాల అధ్యక్షులను ఇష్టమున్నట్లు మార్చారంటూ నిజామాబాద్ జిల్లా BJP లీడర్లు ఆందోళన బాట పట్టారు. జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. 13 మండలాల ప్రెసిడెంట్లను మార్చి MP ధర్మపురి అర్వింద్ గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నామని… డెడికేషన్ తో పనిచేస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్తున్న తమను కారణం లేకుండా మార్చడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలే ఎలక్షన్ల టైం.. ఇప్పుడు అధ్యక్షులను మార్చితే మండలాల్లో తీవ్ర ప్రభావం పడుతుంది.. దీనిపై ఇకనైనా వైఖరిని మార్చుకోవాలంటూ నిరసన తెలిపారు.
ఇదే అంశంపై మూడు రోజుల క్రితం BJP రాష్ట్ర కార్యాలయంలోనూ నిజామాబాద్ నాయకులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రెసిడెంట్ కిషన్ రెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. పార్టీ పెద్దలు పట్టించుకోవట్లేదంటూ ఇప్పుడు ఏకంగా జిల్లా ఆఫీసు ముందరే ఆందోళనకు దిగారు.