ఆర్టీసీ సిబ్బంది ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్నారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. TSRTCని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని, అందుకు సంబంధించిన బిల్లును త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు. ఇకపై 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కేబినెట్ నిర్ణయించినట్లు వివరించారు. విధివిధానాలు, నిబంధనల కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఈ కమిటీ అధ్యక్షుడిగా ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉండగా.. ఆర్ అండ్ బీ, రవాణా, జీఏడీ, లేబర్ డిపార్ట్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారన్నారు.