
వరదల విలయంలో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ముంపు ప్రాంతాల్లో మరమ్మతులు, పునరావాసం, సహాయక చర్యల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన 40 మందికి పరిహారమివ్వాలని కేబినెట్ డిసిషన్ తీసుకుంది. కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రి కేటీఆర్.. ఈ వివరాల్ని వెల్లడించారు. 10 రోజుల పాటు కురిసిన వర్షాల వల్ల సంభవించిన నష్టాన్ని గుర్తించి తక్షణ సాయం కింద ఈ నిధుల్ని ఇస్తున్నామన్నారు.
పంటలు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లతోపాటు చెరువులు, కాల్వల రిపేర్లకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. వరదల తాకిడికి గురైన 27,000 మందిని తిరిగి వారి ఇళ్లకు చేర్చేలా ఈ నిధుల్ని ఖర్చు చేస్తామని కేటీఆర్ తెలిపారు.