మేష రాశి (Aries)
ఈ రాశి వారికి ఈరోజు అత్యంత శుభదినం. మీకు అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. మీరు చేసిన పుణ్యకార్యాల వలన ప్రయోజనాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. మీరు ఈరోజు సంతోషంగా ఉంటారు. ఇప్పటివరకు ఉన్న అనారోగ్య సమస్యలు ఈ రోజు సమసిపోతాయి. ఇంటి నిర్మాణ పనులు కోసం అధిక ధన వ్యయం ఉంటుంది. మీ సంతోషాన్ని చూసి మీ ప్రత్యర్థులలో కొందరు అసూయ పడతారు, ఆధ్యాత్మిక పనుల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది.
వృషభ రాశి (Taurus)
ఈరోజు మీరు ఆర్ధిక, వ్యాపార లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. మీ శ్రమ కారణంగా మీరు ఈ రోజు చాలా ప్రయోజనాలు పొందుతారు. వ్యక్తిగత విషయాలలో బయటి వ్యక్తులను సంప్రదించవద్దు. కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా విభేదాలు ఉంటే, ఈరోజు చర్చల ద్వారా పరిష్కరించడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. వ్యాపార రంగంలో ఉన్న వారు ఆర్ధిక సమస్యల కారణంగా కొంచెం ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి.
మిథున రాశి (Gemini)
ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ సామర్థ్యాన్ని నిరూపించే విధంగా ఉంటాయి. స్నేహితులు, సహోద్యోగులతో నమ్మకంగా ఉండండి. మీరు చేసుకున్న ఒప్పందాల వలన ప్రయోజనం పొందుతారు. ఈరోజు మీరు పిల్లల వైపు నుంచి కొంత నిరాశాజనకమైన సమాచారాన్ని వినవచ్చు. ముఖ్యమైన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకండి.
కర్కాటక రాశి (Cancer)
ఈ రోజు మీకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు ఆఫీస్ వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు. బ్యాంకింగ్ రంగాలలో పనిచేసే వ్యక్తులు పొదుపు పథకం నుంచి మంచి ప్రయోజనాలను పొందుతారు. కష్టపడి పనిచేసి అధికారులను మెప్పిస్తారు. మీరు సేవా రంగంలో పూర్తి ఆసక్తిని కలిగి ఉంటారు. అనవసర ఆందోళనలకు దూరంగా ఉండండి.
సింహ రాశి (Leo)
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. విద్యార్థులు చదువుతో పాటు పోటీల్లో కూడా పాల్గొంటారు. శారీరక, మానసిక, శ్రమ మూలంగా అలసట, ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఉద్యోగం నిమిత్తం ఇంటి నుంచి దూరంగా వెళ్లవలసి వస్తుంది. స్నేహితులు మీ సహాయం అర్థిస్తారు.
కన్యారాశి (Virgo)
ఈ రోజు మీరు వివేకంతో, విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు వాగ్వాదాలకు దూరంగా ఉండండి. పెద్దలతో మాట్లాడేటప్పుడు మీరు మీ అభిప్రాయాన్ని నిర్భయంగా వెల్లడించండి. మీరు ప్రయాణానికి వెళ్లేటట్టయితే మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. మీకే మేలు జరుగుతుంది. మీరు కొంతమంది కొత్త వ్యక్తులను కలుస్తారు.
తులా రాశి (Libra)
ఈ రోజు మీ రోజు సాధారణంగా ఉంటుంది. సోదరులతో అనుబంధం పెరుగుతుంది. కొత్త పరిచయాల ఏర్పడతాయి, వాటి వలన మీరు ప్రయోజనం పొందుతారు. సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి, మీ పట్ల వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. తల్లిదండ్రుల ఆశీస్సులతో మీ ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. మీరు పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలను వినవచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి, లేకుంటే ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు కొన్ని సమస్యల నుంచి బయట పడతారు.
వృశ్చిక రాశి (Scorpio)
ఈరోజు మీకు ఆనందంగా ఉంటుంది. మీరు పెద్దల సహకారంతో విజయం సాధిస్తారు. కొన్ని పాత సంప్రదాయాలను విడిచిపెట్టి, మీరు పిల్లల ఆలోచనలతో ముందుకు సాగుతారు. మీరు మీ సౌకర్యాలకు సంబంధించిన వస్తువుల కొనుగోలుకు చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రతగా, ఓపికగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు మీ శ్రమ, చాతుర్యంతో మీ సహోద్యోగులుని ఆకట్టుకుంటారు. మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశముంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. మీరు దూరపు బంధువు నుంచి కొన్ని శుభవార్తలను వినవచ్చు. అవివాహితులకు వివాహ సూచన. మీరు కొన్ని ముఖ్యమైన చర్చలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి చాలా సపోర్ట్ ఉంటుంది. అనవసర సలహాలు ఇవ్వడం మానుకోవాలి. మీరు సృజనాత్మక రంగం లో ఉన్నవారు మంచి అవకాశం పొందుతారు.
మకర రాశి (Capricorn)
ఈ రోజు, మీరు కొన్ని సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో మీరు పూర్తి భాగస్వాములవుతారు. కుటుంబ సంబంధాలలో, సన్నిహితుల దగ్గర వినయపూర్వకంగా ఉండండి. లేకుంటే వివాదాలు తలెత్తే అవకాశముంది. ఉద్యోగస్తులు వివాదాలకు, అనవసర విషయాలకి దూరంగా ఉండండి.
కుంభ రాశి (Aquarius)
ఈ రోజు మీకు శుభదినం. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. మీరు కుటుంబంలో పెద్దవాళ్ల నమ్మకాన్ని పొందగలుగుతారు. మీరు మీ బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు ఈ రోజు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ లక్ష్యంపై పూర్తి దృష్టిని కొనసాగించండి. స్నేహితులతో కలిసి, మీరు మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. వాణిజ్య విషయాల్లో కూడా ఈరోజు మంచి పురోగతి ఉంటుంది. రాజకీయ నాయకులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి ( Pisces)
ఈరోజు మీకు మిశ్రమ రోజుగా ఉండబోతోంది. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ పెద్దల నుంచి మీకు చాలా మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించవచ్చు. మీరు ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ఆదాయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా గడుపుతారు. మీరు మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకుంటే, మీ పనిలో విజయం సాధిస్తారు.
రాళ్లపల్లి సరస్వతీదేవి
గమనిక: కొందరు పండితులు కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించి రాసిన సమాచారమిది. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.