జీఎస్టీ(GST) వసూళ్లు సరికొత్త రికార్డులు నమోదు చేస్తూనే ఉన్నాయి. ఈ జులై నెలలోనూ రికార్డు స్థాయిలో నిధులు వచ్చాయి. ఆ నెలలో మొత్తం రూ.1.65 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇలా 1.60 లక్షల కోట్లు దాటడం ఇది ఐదోసారి కావడం విశేషం. ఈ వసూళ్లు గతేడాదితో పోలిస్తే పెరిగాయని.. ఆ పెరుగుదల 11 శాతంగా ఉన్నట్లు చెప్పారు. గత నెలలో CGST కింద రూ.29,773 కోట్లు, SGST ద్వారా రూ.37,623 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.