
అశేష భక్త జనవాహిని తన్మయత్వంతో పులకించగా.. తిరుమాడ వీధులు బ్రహ్మోత్సవ సంబరాల్ని తలపించగా.. తిరుమల శ్రీవారు గరుడ వాహనంపై ఊరేగిన ఘట్టం అంగరంగ వైభవంగా సాగింది. గరుడ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ గరుడ వాహన సేవ కార్యక్రమం ఆద్యంతం కనుల పండువగా సాగింది.
గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగి స్వామి వారు.. భక్తులను కటాక్షించారు. సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి మాడ వీధుల్లో విహరిస్తుండగా భక్తులు తన్మయత్వం పొందారు. తిరుమాడ వీధులు గోవింద నామస్మరణతో మారుమోగాయి.