‘బ్రో’ సినిమాపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ మీద ఆ మూవీ నిర్మాత స్పందించారు. ‘బ్రో’ బ్లాక్ బస్టర్ మూవీ.. పవన్ కు ఎంతిచ్చామో అనవసరమైన వారికి చెప్పాల్సిన అవసరం లేదు.. నెట్ ఫ్లిక్స్, జీటీవీతో మంచి బిజినెస్ జరిగింది అంటూ ప్రొడ్యూసర్ టి.జి.విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. సినిమా లెక్కలపై మంత్రి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, కానీ ప్రతి దానికీ తమ వద్ద లెక్కలు ఉన్నాయని గుర్తు చేశారు. ఒక్కో సినిమాకు రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటానని గతంలోనే పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ లో ఏ మాత్రం నిజం లేదని, OTT రైట్స్ అమ్మడం ద్వారా మంచి బిజినెస్(Business) జరిగిందని నిర్మాత చెప్పారు.
‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు పాత్ర తనను ఉద్దేశించే తయారు చేశారని ఆరోపించిన రాంబాబు… పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆయనకు పలు పెళ్లిళ్లు జరిగాయని, వాటి ఆధారంగా పవన్ బయోపిక్ తీస్తున్నామని వెల్లడించారు. జనసేనానికి ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా తిరిగి రాలేదని, ఆ సినిమాను ఆడియన్స్ ఆదరించలేదంటూ రాంబాబు మాట్లాడారు.