MLA సిఫారసులతో పోలీసు శాఖలో పోస్టింగ్ లు ఇవ్వడం దారుణమని సుపరిపాలన వేదిక(Forum For Good Governance) ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు DGP అంజినీకుమార్ కు లేఖ రాసింది. DSP, CI, SI.. ఇలా అన్ని పోస్టింగ్స్ లోనూ నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉంటున్నదని, పోలీసు శాఖలో లీడర్ల ప్రమేయం ఏంటని లెటర్ లో గుర్తు చేశారు.
రాబోయే ఎలక్షన్ల దృష్ట్యా నచ్చినవారిని తమకు ఇష్టమొచ్చినట్లు ట్రాన్స్ ఫర్ చేయించుకుంటున్నారని లెటర్లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది. MLAల సిఫారసులతో జరిగిన బదిలీలు తక్షణమే రద్దు చేసి పోలీసు శాఖ గౌరవం పెరిగేలా చూడాలని వేదిక అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి కోరారు.