హత్యకు గురైన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు కేసులో నిందితులను నేరస్థులుగా ధ్రువీకరిస్తూ కోర్టు జైలు శిక్ష విధించింది. జీవితఖైదుతోపాటు ఫైన్ విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్డు జడ్జి వసంత్ పాటిల్ తీర్పునిచ్చారు. ఇద్దరు వ్యక్తులకు ఈ శిక్షను ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దోషులకు జీవిత ఖైదుతోపాటు రూ.1000 ఫైన్ విధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చంద్రుగొండ మండలం ఎర్రబోడు ఫారెస్ట్ ఏరియాలో పోడు భూముల ఘర్షణ జరిగింది. 2022లో జరిగిన ఈ గొడవల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(FRO) శ్రీనివాసరావు హత్యకు గురయ్యారు.
ఫారెస్ట్ సిబ్బంది, గిరిజనుల మధ్య పెద్దయెత్తున ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పరిస్థితులు అదుపు తప్పడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘర్షణల్లో దాడికి గురైన FRO శ్రీనివాసరావు.. తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అటవీశాఖ అప్పట్లో పెద్దయెత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
ఎట్టకేలకు న్యాయస్థానం ఈరోజు తీర్పును ప్రకటించింది.