మేము మాట్లాడితే మాట్లాడుతున్నవు అంటరు.. మాట్లాడకపోతేనేమో మాట్లాడుతలేవు అంటరు.. ఇదేమైనా బాగుందా అంటూ కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి అన్నారు. ‘కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తనను అభినందించాల్సింది పోయి మాపై కామెంట్స్ చేస్తున్నారని BRS సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. ముగ్గురా, పన్నెండు మందా.. ఎంతమందని కాదు.. ఏ మాట్లాడుతున్నామనేదే ముఖ్యం’ అని శాసనమండలిలో అన్నారు. వరదల్లో చోటుచేసుకున్న ఆస్తి నష్టం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మండలిలో సుదీర్ఘ చర్చ జరిగింది. దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, కుంటలను బాగు చేసి వాటి వల్ల పంటలు కోల్పోయిన రైతులకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని జీవన్ రెడ్డి సూచించారు.
వరదల సమయంలో గతేడాది జులై 17న ముఖ్యమంత్రి స్వయంగా భద్రాచలంలో పర్యటించి రూ.1000 కోట్లు అనౌన్స్ చేశారు. కానీ అందులో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఇంతవరకు సహాయక చర్యలే చేపట్టలేదని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. 2018-19 నుంచి 2021-22 వరకు కేంద్రం రూ.44,219 కోట్లు రిలీజ్ చేస్తే రాష్ట్రానికి ఒక్క రూపాయి రాలేదని, ఎందుకు తెలంగాణ పట్ల కేంద్రానికి వివక్ష ఉందని కామెంట్స్ చేశారు.