అసెంబ్లీ మీటింగ్స్ మూడు రోజులు జరిగితే ఏం మాట్లాడుతమని BJP సీనియర్ MLA ఈటల రాజేందర్ అన్నారు. సభకు బాధ్యత ఉందని, ప్రజల సమస్యలు చర్చిస్తారన్న సోయి ప్రభుత్వానికి లేదని తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడిన ఆయన.. వరదల తీరుపై ఆవేదన చెందారు. వరదల్లో ప్రజలు అన్నీ కోల్పోయి అవస్థలు పడుతుంటే KCR సర్కారుకు పట్టింపులేదని మండిపడ్డారు. కనీసం BAC సమావేశానకి కూడా పిలవలేదని, ఇదేం సంప్రదాయమో తెలిసిపోతుందని ఫైర్ అయ్యారు.
ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలాంటి అవమానం జరగలేదని, BJP సభ్యులున్న పార్టీకి కనీసం ఆఫీస్ కేటాయించలేదని ఈటల విమర్శించారు. 20 రోజులపాటు సాగాల్సిన అసెంబ్లీ మీటింగ్స్ కేవలం మూడు రోజులకే పరిమితం చేస్తే ఎలాగంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.