BJP రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, నేషనల్ జనరల్ సెక్రటరీ(General Secretary) బండి సంజయ్ ని ప్రధాని(Prime Minister) మోదీ అభినందించారు. ‘బాగా కష్టపడ్డావ్ సంజయ్.. పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురండి’ అంటూ భుజం తట్టారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత తొలిసారిగా సంజయ్ కుటుంబసభ్యులతో కలిసి మోదీని కలుసుకున్నారు. పార్టీ కోసం బాగా కష్టపడ్డావని, ఇప్పుడు కొత్త పదవితో మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూచించిన ప్రధాని.. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు.
సంజయ్ కుటుంబ సభ్యులను పలకరించిన ప్రధాని… వారితో ఫొటోలు దిగారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని, ప్రధాని ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనిదని సంజయ్ ఆనందంతో చెప్పారు.
జ్నానవాపి ఆలయంలో (మసీదుకాదు) సర్వే ప్రారంభం సనాతన ధర్మ పరంగా జరపడం అభినందనీయం.అక్కడ శివలింగం ఉందని నిరూపించే అవకాశం న్యాయమైనది కనుకనే న్యాయస్థానం అనుమతించిందని గ్రహించండి