తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తుల సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. 27 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం స్వామి వారిని 59,898 మంది దర్శించుకున్నారు. 26,936 మంది నిన్న తలనీలాలు సమర్పించారు. వారాంతం కావడంతో భారీ సంఖ్యలో దర్శనం కోసం తిరుమలకు వస్తున్నారు. శని, ఆదివారాల్లో ఈ రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.