విలీన బిల్లుకు ఆమోదముద్ర వేయాలంటూ RTCలోని పలు సంఘాల కార్మికులు నిరసనకు దిగాయి. పెద్దసంఖ్యలో తరలివచ్చిన కార్మికులు రాజ్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎలాంటి సంకోచాలు లేకుండా బిల్లును ఆమోదించాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పొద్దున 6 నుంచి 8 గంటలకు బంద్ నిర్వహించిన కార్మికులు అనంతరం రాజ్ భవన్ వద్దకు చేరుకున్నారు. ఆర్టీసీ కార్మికుల రాకతో రాజ్ భవన్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంతమంది యూనియన్ లీడర్లతో గవర్నర్ మాట్లాడతారని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించడంతో అక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడింది.
ఇందుకోసం ముందుగానే రాజ్ భవన్ అధికారులు… 10 మంది లీడర్లను లోపలికి పంపించేందుకు అనుమతినిచ్చారు. అయితే గవర్నర్ తమిళిసై పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా RTC యూనియన్ల లీడర్లతో మాట్లాడారు.