రాజ్ భవన్ ముట్టడి, బస్సుల బంద్ పై RTC యూనియన్ల మధ్య మళ్లీ లొల్లి జరిగింది. బంద్ కు తాము దూరమని ప్రకటించిన ఎంప్లాయిస్ యూనియన్(EU) వైఖరిపై తెలంగాణ మజ్దూర్ యూనియన్(TMU) రాత్రి నుంచి గుర్రుగా ఉంది. ఈరోజు పొద్దున రెండు గంటల పాటు బస్సుల బంద్ నిర్వహించిన తర్వాత రాజ్ భవన్ కు చేరుకున్నారు TMU నాయకులు, కార్మికులు. ఈ సంఘం లీడర్లతో గంట పాటు గవర్నర్ మాట్లాడారు. అయితే తమను పిలవలేదంటూ మిగతా సంఘాల నాయకులు అనడంతో వారిపై TMU లీడర్ థామస్ రెడ్డి మండిపడ్డారు.
TMU ద్వారానే ఉద్యమం నడిపామని, మెజార్టీ సంఘంగా మా బాధ్యత నిర్వర్తించామని థామస్ రెడ్డి వెల్లడించారు. JAC అని మమ్మల్ని తిట్టిన వ్యక్తులు ఇప్పుడు గవర్నర్ వద్దకు తీసుకెళ్లలేదంటున్నారు.. ‘వాళ్లు మాకు వ్యతిరేకులు.. కార్మిక వ్యతిరేకులు.. ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది, ప్రభుత్వాన్ని ఒప్పించిందీ మేము.. అంటూ థామస్ రెడ్డి కామెంట్ చేశారు.