తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కి కొత్త ఛైర్మన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. YCP సీనియర్ లీడర్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ పదవికి నియమితులయ్యారు. గతంలోనూ ఛైర్మన్ గా పనిచేసిన ఆయన.. ఇప్పుడు మరోసారి బాధ్యతలు చేపడుతున్నారు. ప్రస్తుతం తిరుపతి MLA అయిన భూమన.. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో 2006 నుంచి 2008 వరకు తితిదే ఛైర్మన్ గా పనిచేశారు.