చంద్రయాన్-3 ప్రయోగించిన 22 రోజులకు మరో కీలక ప్రక్రియను ఇస్రో(ISRO) సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3ని ప్రవేశపెట్టింది. చంద్రుడి కక్ష్యలోకి వెళ్లేలా ‘లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్’ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఇంకో 18 రోజుల పాటు ఈ చంద్రయాన్-3 చంద్రుడి కక్ష్యలోని పరిభ్రమిస్తుంది. ఈ ప్రక్రియనంతటినీ బెంగళూరు బైలాలులోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్ వర్క్(IDSN) ఆధ్వర్యంలో మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్(MOX) పర్యవేక్షిస్తోంది.