అభివృద్ధి దిశగా రైల్వే పరుగులు పెడుతున్నదని, ప్రగతి పథాన సాగుతున్న భారత్ వైపు మొత్తం ప్రపంచమే చూసే పరిస్థితి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమృత్ భారత్ కింద దేశవ్యాప్తంగా చేపట్టనున్న 1300 రైల్వే స్టేషన్లలో భాగంగా ఫస్ట్ ఫేజ్(First Phase)లో 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి(Development)కి రూ.25 వేల కోట్లు వెచ్చిస్తున్న ప్రాజెక్టుకు.. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. డెవలప్ మెంట్ పూర్తయ్యాక ఈ ర్వైల్వే స్టేషన్లు మల్టీమోడల్ హబ్ గా మారి షాపింగ్ మాల్స్, గేమింగ్ జోన్స్ వంటివి అందుబాటులోకి వస్తాయి. అన్ని రవాణా సౌకర్యాలు మెట్రో, బస్సు, టాక్సీ వంటివి అందుబాటులో ఉండేలా మల్టీ మోడల్ స్టేషన్స్ గా తయారవుతాయి. ట్రాన్స్ పోర్టేషన్ ను పెంచడం ద్వారా దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందికి ఉపాధి లభించనుందని ప్రభుత్వం భావిస్తున్నది.
నాంపల్లి రైల్వేస్టేషన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రోగ్రాంకు బండి సంజయ్ అటెండ్ అయ్యారు. రాష్ట్రంలో రూ.898 కోట్లతో 21 స్టేషన్లలో డెవలప్ మెంట్ వర్క్స్ మొదలవుతాయి. హైదరాబాద్, ఆదిలాబాద్, భద్రాచలంరోడ్డు, కరీంనగర్, కాగజ్ నగర్, రామగుండంతోపాటు పలు స్టేషన్లలో ఈ వర్క్స్ స్టార్ట్ కానున్నాయి.