అనుమానాలు, అసంతృప్తులు, ఆధిపత్యాల నడుమ మూడు రోజులుగా ఊగిసలాట ధోరణితో కొట్టుమిట్టాడుతున్న RTC బిల్లుకు ఎట్టకేలకు ముందడుగు పడింది. ఈ బిల్లుకు ‘గ్రీన్ సిగ్నల్’ ఇస్తూ గవర్నర్ సిఫారసు చేశారు. విలీన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనుమతినిచ్చారు. ఈ మేరకు ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు.
గవర్నర్ పర్మిషన్ కోసం వేచి చూస్తున్న సర్కారు… ఇక బిల్లు సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. బిల్లుతోపాటు న్యాయపరమైనవి, ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన వాటితోపాటు మొత్తం 10 అంశాలను గవర్నర్ సిఫారసు చేశారు.