రామ్ చరణ్ సతీమణి ఉపాసన రేపు బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. డెలివరీ కోసం ఆమె అపోలో హాస్పిటల్ లో చేరారు. భర్త రామ్ చరణ్ వెంటరాగా ఆమె ఆస్పత్రికి చేరుకున్నారు. రేపు(మంగళవారం) ఉదయం 6 గంటలకు డెలివరీ అయ్యే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబమంతా అపోలోకు చేరుకుని తోడుగా ఉంటున్నారు. చరణ్-ఉపాసనకు 2012లో వివాహమైన విషయం తెలిసిందే.