తెలంగాణ ఉద్యమ పాటకు ఊపిరిలూదిన జన గాయకుడు గద్దర్ అంత్యక్రియలకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు. ప్రజాగాయకుడి అంతిమ ఘట్టానికి రావాలని సీఎం నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం.. ఆయన పాటలు ఉద్యమాన్ని ఎలా ప్రభావితం చేశాయో నెమరువేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే తుది ఘట్టానికి కేసీఆర్ హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని CM ఇంతకుముందే ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు అధికార యంత్రాంగం పొద్దున్నుంచే ఏర్పాట్లు చేసింది.