

ధాన్యం అమ్మిన రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని విడుదల చేసింది. ఇవాళ(సోమవారం) రూ.1500 కోట్లు విడుదల కాగా.. ఆన్లైన్ ప్రొక్యూర్ మేనేజ్ మెంట్ సిస్టమ్(OPMS)లో నమోదైన రైతుల ఖాతాల్లో అవి జమవుతాయి. ఇప్పటివరకు రూ.11,444 కోట్లను రైతులకు అందజేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 11.10 లక్షల మంది రైతుల నుంచి ఈ నెల 19 దాకా 65.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కొనుగోళ్లు దాదాపుగా ముగిసినట్లేనన్న మంత్రి, కొన్ని సెంటర్లలో మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు.