‘మణిపూర్ లో మీరు తల్లులను హత్య చేశారు.. దేశాన్ని చంపేశారు.. మీరు దేశాన్ని రక్షించేవారు కాదు, హంతకులు.. మణిపూర్ మాట వినేందుకు మోడీ ఇష్టపడటం లేదు.. మణిపూర్ ను రెండుగా విభజించారు.. ప్రధాని మోదీ దృష్టిలో మణిపూర్ దేశంలో భాగం కాదు’ అంటూ రాహుల్ గాంధీ తీవ్రమైన కామెంట్స్ చేశారు. అవిశ్వాస తీర్మానంపై ప్రసంగిస్తున్న సమయంలో రాహుల్ మాట్లాడిన మాటలపై లోక్ సభ దద్దరిల్లింది. ‘రావణుడు కేవలం మేఘనాథుడు, కుంభకర్ణుడి మాటలే వినేవాడు.. ఇప్పుడు మోదీ అమిత్ షా, అదానీ మాటలే వింటున్నారు.. మీరు దేశ భక్తులు కాదు, దేశద్రోహులు’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దీనిపై BJP దీటుగా సమాధానమిచ్చింది. స్మృతి ఇరానీ మాట్లాడుతూ రాహుల్ తీరుపై ఫైర్ అయ్యారు. ‘UPA హయాంలో జరిగిన ఘోరాలు రాహుల్ కు కనపడలేదా.. రాజస్థాన్ లో మహిళ హత్యాచారం, కశ్మీర్ పండిట్ల ఊచకోత.. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి.. మణిపూర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే.. దాన్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు.. మీ దేశభక్తి ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసు’ అంటూ స్మృతి ఇరానీ తీవ్రంగా మండిపడ్డారు. ఇలా ఇరుపార్టీల సభ్యుల అరుపులు, నినాదాల నడుమ సభలో గందరగోళం ఏర్పడింది.