ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ లీడర్లు, సినీ యాక్టర్ల మధ్య యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఇప్పటికే జనసేన తరఫున పవన్ కల్యాణ్ AP సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తుంటే ప్రతిగా మంత్రులు సైతం ఆయనపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల ఫంక్షన్ లో చిరంజీవి చేసిన కామెంట్స్ అగ్గిని రాజేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై ఫోకస్ చేయాలే గానీ మూవీ ఇండస్ట్రీపై కాదంటూ చిరు మాట్లాడారు. దీనిపై మంత్రులు మూకుమ్మడి దాడికి దిగారు. కొడాలి నాని, అంబటి రాంబాబు ఇలా మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాజాగా ఈ కోవలో ఆర్.కె.రోజా చేరారు. సలహాలు మాకు కాదు.. ముందు మీ తమ్ముడికి ఇవ్వండి. కేంద్ర మంత్రిగా పనిచేసిన మీరు ‘స్పెషల్ స్టేటస్’ ఏం చేశారు అంటూ ప్రశ్నించారు.
సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడటం తగదు.. మీరు చెబితే వినే స్థాయిలో మేం లేము.. ఏమైనా చెప్పాలనుకుంటే ముందుగా మీ తమ్ముడికి చెప్పండి.. అంటూ రోజా చిరంజీవికి కౌంటర్ ఇచ్చారు.