
రాంచరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం వేకువజామున జూబ్లీహిల్స్ హాస్పిటల్లో ఉపాసన.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. డెలివరీ కోసం ఉపాసన సోమవారం సాయంత్రం అపోలోలో చేరారు. భర్త చరణ్ తోపాటు మెగాస్టార్ కుటుంబ సభ్యులు అంతా అక్కడే ఉన్నారు.

ఇరు కుటుంబాలు అక్కడే…
చరణ్-ఉపాసనకు 2012లో వివాహమైన సంగతి తెలిసిందే. వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్లు గత డిసెంబరు 12న రెండు కుటుంబాలు ప్రకటించాయి. బుల్లి ప్రిన్సెస్ రావడంతో కొణిదెల, కామినేని కుటుంబ సభ్యులు ఆపోలో హాస్పిటల్ కు చేరుకున్నారు. చిరంజీవి కుటుంబంలో మూడో తరం అడుగుపెట్టడంతో.. ఆ ఇంట సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.