హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో కొన్ని చోట్ల ల్యాండ్ ధరలకు రెక్కలొచ్చినట్లే కనపడుతున్నది. ఇప్పటికే కోకాపేటలో ఎకరం కోట్లల్లో పలికితే తాజాగా బుద్వేల్ లోనూ అదే జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని ఈ భూములు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కోకాపేటలో 43 ఎకరాలకు 3,319.60 కోట్ల ఆదాయం వస్తే బుద్వేల్ లో 100.01 ఎకరాల్లోని 14 ప్లాట్లకు 3625.73 కోట్ల ఇన్ కం(Income) సమకూరింది. HMDA వేసిన వేలంలో ఎకరం రేట్ హయ్యెస్ట్ గా రూ.41.75 కోట్లు పలకగా.. యావరేజ్ లెక్కేస్తే ఎకరం రూ.36.25 కోట్లకు అమ్ముడైంది. మొత్తం 14 ప్లాట్లను అమ్మకానికి పెడితే అందులో 3 ప్లాట్లల్లో ఒక్కొక్కదానికి రూ.40 కోట్ల కంటే ఎక్కువ ధర వచ్చింది.
కోకాపేట నియో పొలిస్ ల్యాండ్స్ కు మొన్నీమధ్య భారీగా ఆదాయం వచ్చిన సంగతి తెలిసిందే. హయ్యెస్ట్ గా ఎకరం ధర రూ.100.75 కోట్లు పలికిందంటేనే డిమాండ్ ఎలా ఉందో తెలియజేసింది. మొత్తంగా 143 ఎకరాలు అమ్మితేనే HMDAకు రూ.6,945 కోట్లు వచ్చాయి.