దేశంలో విప్లవాత్మక మార్పులకు వేదికవుతున్న డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ ను అప్ గ్రేడ్(Upgradation) చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ట్రాన్జాక్షన్స్(Transactions)ను సరళతరం(Easyest) చేసి అందరికీ అందుబాటులోకి తేవాలన్న టార్గెట్ తో కొత్త ఫీచర్లను ప్రకటించింది. ఏటా వేలాది కోట్ల వ్యాపారం జరుగుతున్న UPI(Unified Payment System)ని వాడుకోవడానికి ఇప్పటిదాకా ఇంటర్నెట్ అవసరం. ఈ ఆన్ లైన్ సిస్టమ్ వల్ల చాలా సార్లు డిజిటల్ పేమెంట్లు జరపలేకపోతున్నాం. కానీ ఇక నుంచి ఆ ప్రాబ్లమ్స్ ఉండవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI చెబుతోంది. గురువారం నిర్వహించిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా RBI గవర్నర్ శక్తికాంతదాస్… UPIలో మూడు కొత్త ఫీచర్లను ప్రకటించారు. ఆఫ్ లైన్(Offline) ద్వారా UPI ట్రాన్జాక్షన్స్ జరపడం.. AI ఆధారిత సిస్టమ్ తో ట్రాన్జాక్షన్స్, AIతో చాటింగ్ చేసుకునే ఫీచర్లు వస్తున్నాయి. ఈ కొత్త ఫీచర్లు వస్తే డిజిటల్ లావాదేవీలు మరింత పెరుగుతాయని భావిస్తున్నామని శక్తికాంతదాస్ అన్నారు.
తొలుత రెండు భాషల్లోనే
ఈ ఫీచర్లను తొలుత రెండు భాషల్లోనే ప్రవేశపెడుతున్నామని.. స్మార్ట్ ఫోన్లు, ఫీచర్ ఆధారిత ఫోన్లలో వీటిని వాడుకోవచ్చని RBI తెలిపింది. హిందీ, ఇంగ్లీష్ లో మాత్రమే ప్రస్తుతానికి ఈ ఫీచర్లు వస్తున్నాయి. Neaest Field Communication(NFC) టెక్నాలజీతో పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ లో స్మార్ట్ ఫోన్ ను ట్యాప్ చేయడం ద్వారా ఆఫ్ లైన్ ట్రాన్జాక్షన్స్ జరపవచ్చని స్పష్టం చేసింది. ఇంటర్నెట్, టెలికాం కనెక్టివిటీ లేని పరిస్థితుల్లోనూ ట్రాన్జాక్షన్లు తగ్గకుండా ఉండేందుకు ఈ ఫీచర్ ను తెస్తున్నట్లు RBI తెలిపింది.