పుంగనూరు ఘటన చూస్తే బాధేసిందని, దానికి కారకుడైన చంద్రబాబుకు సెక్యూరిటీ ఎందుకివ్వాలని CM జగన్ అన్నారు. ‘ఒక రూట్ లో పర్మిషన్ ఉంటే మరో రూట్ కు వెళ్లి అల్లర్లు సృష్టించారు.. 47 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.. అలాంటి వారికి అవకాశమిస్తే నీచ రాజకీయాలు చేస్తారు.. మీ బిడ్డనైనా నాకు మీరు అండగా నిలవాల్సిన అవసరముంది’ అని జగన్ కోరారు. YSR సున్నా వడ్డీ నిధుల్ని అమలాపురంలో నిర్వహించిన కార్యక్రమం ద్వారా అకౌంట్లలో జమ చేశారు.
‘2016లో సున్నా వడ్డీ స్కీమ్ ను చంద్రబాబు క్యాన్సిల్ చేశారు.. రుణాలు మాఫీ చేయకుండా మహిళలందర్నీ మోసం చేశారు.. డ్వాక్రా మహిళలను చంద్రబాబు నడిరోడ్డు మీద నిలబెట్టారంటూ’ జగన్ ఫైర్ అయ్యారు.
ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. అమలాపురం రోడ్లన్నీ జనసంద్రంగా మారిపోయాయి.