వినూత్న డిజైన్లతో చేనేత రంగానికి ప్రముఖ కేంద్రంగా నిలుస్తున్న పోచంపల్లిని తిరువూరు టెక్స్ టైల్ పార్కులా తయారు చేస్తామని ఆ శాఖ మంత్రి KTR హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో చేనేత రంగం దివాళా తీస్తోందని, కానీ KCR సర్కారు ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల పెద్దయెత్తున ఉపాధి కల్పించేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటించిన KTR.. ఔత్సాహిక యువ చేనేత కళాకారుడు సైని భగత్ ఏర్పాటు చేసిన కళా పునర్వి చేనేత యూనిట్ ను ప్రారంభించారు. చేనేతల్ని కాపాడాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన కళా పునర్వి యూనిట్ ను ఆయన మెచ్చుకున్నారు.
తమిళనాడులోని తిరువూరు టెక్స్ టైల్ పార్కులా పోచంపల్లిని తయారు చేయడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని KTR గుర్తు చేశారు. కార్మికులకు త్వరలోనే ఐడెంటిటీ కార్డుల్ని అందజేస్తామని చేనేత జాతీయ దినోత్సవం నాడు కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.