గ్రూప్-2 పరీక్షల్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం ఆదేశాల మేరకు వీటిని నవంబరుకు వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. పరీక్షల రీషెడ్యూల్ ను పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన వెంటనే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. TSPSC అధికారులతో మాట్లాడారు. CM ఆదేశించిన వెంటనే CS.. TSPSC అధికారులతో మాట్లాడాక ఈ వాయిదా నిర్ణయం వెలువడింది.
ఆందోళన బాట పట్టిన అభ్యర్థుల అవస్థల్ని గమనించిన ప్రభుత్వం.. కీలక నిర్ణయం దిశగా అడుగులేసింది. అంతకుముందు గ్రూప్-2 పరీక్ష వాయిదాపై ముఖ్యమంత్రి చర్చించారని తెలిపిన మంత్రి KTR.. ఎగ్జామ్స్ రీషెడ్యూల్ గురించి CSతో మాట్లాడారన్నారు. TSPSCతో మాట్లాడాలంటూ శాంతికుమారికి ముఖ్యమంత్రి సూచించారని ట్విటర్ ద్వారా కేటీఆర్ తెలియజేశారు.
CM ఆదేశాలతో నిమిషాల్లోనే నిర్ణయం
శాంతికుమారితో CM చర్చించడం, ఆ విషయాన్ని కేటీఆర్ ట్విటర్ ద్వారా ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే TSPSC నుంచి నిర్ణయం వెలువడింది. స్వయంగా CM ఆదేశించిన దృష్ట్యా TSPSC ఛైర్మన్, కార్యదర్శితో చీఫ్ సెక్రటరీ మాట్లాడారు. అన్ని అంశాలపై సమీక్షించి డిసిషన్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా కేటీఆర్ ట్వీట్ చేసిన అతి కొద్ది సమయంలోనే వాయిదా నిర్ణయం వెలువడింది. లక్షలాది మంది అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్న సీఎం.. వారు ప్రిపేర్ అయ్యేందుకు టైమ్ ఇవ్వాలని స్పష్టం చేశారు. దీనికితోడు భవిష్యత్తులో ప్రకటించే నోటిఫికేషన్లకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి విస్పష్ట ఆదేశాలిచ్చారు.