టోర్నీలో ఓటమి లేకుండా అప్రతిహత విజయాలు కొనసాగించిన భారత హాకీ టీమ్.. ఆసియా(Asia) ఛాంపియన్(Champion)గా అవతరించింది. మలేషియాతో జరిగిన ఫైనల్ లో 4-3 తేడాతో జయభేరి మోగించింది. మలేషియాతో చెన్నైలో జరిగిన మ్యాచ్ లో ఆట తొమ్మిదవ నిమిషంలోనే జుగ్ రాజ్ సింగ్ గోల్ చేశాడు. 1-0తో ఉన్న ఇండియాపై మలేషియా క్రమంగా లీడ్ సాధించింది. 1-1, 2-1, 3-1 ఇలా మలేషియా ధాటికి భారత జట్టు ఆత్మరక్షణలో పడిపోయింది. టెన్షన్ నెలకొన్న పరిస్థితుల్లో 45వ నిమిషంలో ఏకంగా రెండు గోల్స్ వచ్చాయి. హర్మన్ ప్రీత్ సింగ్, గుర్జత్ సింగ్ తలో గోల్ చేశారు. 3-3తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. 56వ నిమిషంలో ఆకాశ్ దీప్ చేసిన గోల్ తో భారత జట్టు ఛాంపియన్ గా అవతరించింది.
ఆసియా కప్ లో ఐదు సార్లు భారత్ ఫైనల్ చేరితే అందులో నాలుగు సార్లు విజేతగా నిలిచింది.