వచ్చే ఎన్నికల కోసం ఆశావహులు విపరీతంగా పెరిగిపోతున్న దృష్ట్యా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. గెలవగలిగే వ్యక్తులకే టికెట్లు ఇస్తామని సూచనప్రాయంగా ప్రకటించింది. అయితే ఆ టికెట్లను అడ్డదిడ్డంగా కేటాయించే పరిస్థితి ఉండబోదని తేల్చిచెప్పింది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, టికెట్ల కేటాయింపు, క్యాండిడేట్ల పరిశీలన వంటి వాటిపై PCC ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యాయి. పార్టీ సీనియర్లంతా ఈ మీటింగ్ కు హాజరయ్యారు. సెప్టెంబరు ఫస్ట్ వీక్ లో మరోసారి భేటీ కావాలని ఎన్నికల కమిటీ నిర్ణయించింది. అటు స్క్రీనింగ్ కమిటీ సైతం మరోసారి సెప్టెంబరులో మీటింగ్ నిర్వహించాలని తీర్మానించింది.
ఈ రెండు మీటింగ్ ల తర్వాత అభ్యర్థుల సెలక్షన్ ప్రక్రియ ఉంటుందని, తదనంతరమే ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తామని PCC వర్గాలు ప్రకటించాయి. అయితే క్యాండిడేట్ల సెలక్షన్స్ లో ప్రధానంగా సర్వేలను పరిగణలోకి తీసుకుంటామని, కానీ ఆ సర్వేలే పూర్తి ప్రామాణికం కాదని క్లారిటీ ఇచ్చింది.