ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డును నిర్మించాలని భారత్ నిర్ణయించింది. స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day) సందర్భంగా ఈ కీలక ప్రాజెక్టును అమలు చేయాలని(Implementation) చూస్తోంది. ఈ రోడ్డు నిర్మిస్తే భారత్-చైనా బోర్డర్ లో ట్రాన్స్ పోర్టేషన్ కు ముందడుగు పడుతుందని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(BRO) ప్రకటించింది. 19,400 అడుగుల ఎత్తులో చేపట్టనున్న ఈ రోడ్డు.. ఇప్పటివరకు రికార్డు కలిగిన లద్దాఖ్ ఉమ్లింగ్ లా పాస్ లోని మోటారబుల్ రోడ్ ను బీట్ చేస్తుంది. ‘లికారు-మిగ్ లా-ఫుక్సే’ ప్రాంతాలను కలుపుతూ దీన్ని నిర్మిస్తుండగా(Construct), దీనివల్ల సైనిక బెటాలియన్ల రవాణా సులువవుతుందని ప్రభుత్వం భావించింది.
అందులో భాగంగానే దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించాలన్న కేంద్రం నిర్ణయం మేరకు ఈ ప్రాజెక్టును BRO ప్రకటించింది. అతి త్వరలోనే దీని నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని తెలిపింది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లో భారీగా హైవేలను డెవలప్ చేస్తోంది. తద్వారా సైనిక బలగాల రవాణాకు దారుల్ని దగ్గర చేస్తోంది.