ఎప్పుడు ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ పార్టీకి పూర్తి క్లారిటీ ఉందని, తమనెవరూ బెదిరించాల్సిన పనిలేదంటూ PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. SC, ST వర్గీకరణపై హస్తం పార్టీకి స్పష్టమైన విధానం ఉందని గుర్తుచేశారు. వర్గీకరణపై మందకృష్ణ మాదిగ కామెంట్స్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘SC, STలకు దామాషా పద్ధతిలో ఎలా వర్గీకరణ చేయాలో మాకు తెలుసు.. ఎవరి వకాల్తాలు అవసరం లేదు.. బెదిరింపులకు భయపడేది లేదు.. SC కమ్యూనిటీకి కాంగ్రెస్ అంటే ఏంటో తెలుసు.. బెదిరింపులకు పాల్పడేవారు ఇప్పటివరకు ఎవరికి మద్దతిచ్చారో తెలుసుకుంటే మంచిది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంద కృష్ణకు అన్న లాంటి వారని చెబుతారు కదా.. మరి పార్లమెంటులో బిల్లు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు.. కేబినెట్ మీటింగ్ లో ఎందుకు ప్రస్తావన తేవడం లేదు.. ఈ వర్గీకరణను వ్యక్తుల కోసం చేసేది లేదు.. SC, STల రిజర్వేషన్లు పెంచాతాం’ అంటూ రేవంత్ కీలక కామెంట్స్ చేశారు.
ఏ విషయంలో ఎప్పుడు ఎలా వ్యవహరించాలో తమకు తెలుసని, మాట ఇచ్చి అమలు చేయని BJPని వదిలేసి కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకోవాలని చూడటం మంచిది కాదంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.