20 ఏళ్ల బాలికను సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది. మొత్తం ముగ్గురు నిందితులు హత్యాచారానికి పాల్పడ్డట్లు గుర్తించగా.. అందులో ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. ఆ ఇద్దరిని పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బికనీర్ జిల్లాలోని ఖాజువాలా ప్రాంతంలో బాలిక మృతదేహం గుర్తించామని అక్కడి ఐజీ ప్రకటించారు. ముగ్గురిలో ఇద్దరు ఖాజువాలా పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు ఉన్నారని బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లయింట్ తో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.