పవన్ కల్యాణ్ తో ప్రేమలో పడ్డందుకే ఎప్పుడూ నిజాలే మాట్లాడుతున్నానని ఆయన మాజీ సతీమణి(Wife) రేణూదేశాయ్ అన్నారు. తనను పవన్ వ్యక్తిగతంగా మోసం చేసిన మాట వాస్తవమేనని, పాలిటిక్స్ పరంగా మాత్రం ఆయనకే నా మద్దతు అని మరోసారి స్పష్టం చేశారు. ‘బ్రో’ మూవీ సందర్భంగా తలెత్తిన వివాదాలు, తాను రెస్పాండ్ అయిన తీరుపై పలు విమర్శలు వచ్చిన దృష్ట్యా రేణూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ‘విడాకుల విషయంలో మాజీ భర్త గురించి మాట్లాడితే ఆయన అభిమానులు తిట్టారు.. ఇప్పుడు దేశ సిటిజన్(Citizen)గా మాట్లాడితే ఆయన వ్యతిరేకులు తిడుతున్నారు.. గతంలో విడాకుల సందర్భంలో తాను డబ్బులు తీసుకుని అలా చేస్తున్నానని అన్నారు.. అప్పుడూ, ఇప్పుడు రెండు సందర్భాల్లోనూ నిజాలే చెప్పాను.. ప్రేమలో పడి నిజం మాట్లాడినందుకు చెల్లించుకున్న మూల్యం ఇదేనేమో.. ఇదే నా విధి అయితే అలాగే ఉండనీయండి’.. అంటూ రేణూదేశాయ్ నిర్వేదంతో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘బ్రో’ సినిమా రిలీజ్ కావడం.. శ్యాంబాబు పాత్రను తన పేరుతోనే తయారుచేశారని మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అవడం… పవన్, YCP నేతల పరస్పర దాడుల నడుమ ఫారిన్ నుంచి తిరిగివస్తూ కల్యాణ్ పొలిటికల్ లైఫ్ తోపాటు తన పిల్లల్ని అందులోకి లాగడంపై రేణూ కామెంట్స్ చేయడం.. దానికి అంబటి రాంబాబు కౌంటర్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రేణూదేశాయ్ మరోసారి వీడియోలో తన మెసేజ్ ను పెట్టడంతో ఆసక్తికరంగా మారింది.