కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T(GreatestOfAllTimes) అనేది సబ్ టైటిల్. పాగల్ ఫేమ్ నరేశ్ కుప్పిలి డైరెక్షన్లో దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన టైటిల్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చిందని… రీసెంట్గా హైదరాబాద్‌లో తొలిషెడ్యూల్‌ను పూర్తిచేశామన్నారు. హీరోహీరోయిన్లపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్‌ను షూట్ చేశాం.. ఖర్చు విషయంలో రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తీస్తున్నామన్నారు. టెక్నికల్‌గా కూడా చాలా ఉన్నతస్థాయిలో ఉంటుందని, సుడిగాలి సుధీర్ కెరీర్లో ఈ మూవీ మైల్‌స్టోన్‌గా నిలుస్తుందన్నారు.