గత కొద్దిరోజులుగా హైదరాబాద్ పరిసరాల్లో భూముల అమ్మకాలు చూస్తే ఆకాశాన్నంటుతున్నాయి. గజం మినిమమ్ లక్షకు తక్కువ లేదు. కోకాపేట, బుద్వేల్ ఇలా అన్ని చోట్ల భారీగా డబ్బులు వస్తున్నాయి. తాజాగా మోకిల ల్యాండ్స్ విషయంలో HMDAకు వింత పరిస్థితి ఎదురైంది. ఈ భూముల అమ్మకాల్లో మాఫియా హస్తం ఉందా అని నేరుగా కొనుగోలుదారులే ప్రశ్నించారు. ఫస్ట్ ఫేజ్ లో రూ.లక్ష ఎలా పలికిందని, చుట్టూ ల్యాండ్స్ ఉన్నవారే అడ్డగోలుగా రేట్స్ పెంచుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని HMDA అధికారులకు తెలిపారు. మేడిపల్లి, బాచుపల్లి లేఅవుట్లలో ల్యాండ్స్ తీసుకున్న వాళ్లలో చాలా మంది డబ్బులు కట్టలేదని, దీని వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు.
డిపాజిట్ ను రూ.లక్ష నుంచి రూ.10 లక్షలకు పెంచితే ఫేక్ కొనుగోళ్లు తగ్గుతాయన్నారు. వేలంతో సంబంధం లేకుండా లాటరీ ద్వారా ప్లాట్లు సేల్ చేయాలని సూచించారు. మోకిలలో ఫస్ట్ ఫేజ్ లో 50 ప్లాట్లు సేల్ కాగా.. సెకండ్ ఫేజ్(Second Phase)లో 300 ప్లాట్స్ అమ్మాలని HMDA నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి 29 వరకు జరిగే వేలం కోసం ప్రీబిడ్ మీటింగ్ ఏర్పాటు చేయగా, పలువురు HMDAకు ప్రశ్నలు వేశారు. దీంతో ఈ ప్లాట్ల విషయంలో పలు అనుమానాలు కలుగుతున్నాయి.