
దిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి దిల్లీలోనే బుధవారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. 108 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఈ ఫ్లైట్ లో టెక్నికల్ ఇష్యూ ఏర్పడింది. ‘ఇండిగో ఫ్లైట్ 6E 2134’లో సమస్య తలెత్తడంతో పైలట్.. దిల్లీ ఏటీసీని సంప్రదించాడు. పరిస్థితిని గమనించిన అక్కడి అధికారులు ల్యాండింగ్ కు అనుమతించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటించింది.