భారతదేశంలో పన్ను చెల్లింపుదార్ల తలసరి ఆదాయం ప్రస్తుతం రూ.13 లక్షలు ఉండగా… అది 2047 నాటికి రూ.49.7 లక్షలకు పెరగనుందట. ఇది 2014లో రూ. 2.2 లక్షలు ఉండగా.. 2025 17.2 లక్షలకు చేరుకుంటుంది. 2011 నుంచి 2022 ఆర్థిక సంవత్సరాల(Financial Years)లో దాఖలు చేసిన IT రిటర్న్ ల ఆధారంగా విశ్లేషణ జరిగింది. మధ్యతరగతి వర్గాల ఆదాయాల్లో పెరుగుదల, IT రిటర్న్ ల సంఖ్య గణనీయంగా తగ్గడంతో సానుకూల ధోరణి కనపడిందట. రాబోయే 25 ఏళ్లలో దేశ పురోగతి ఎలా ఉండనుందనే అంశంపై SBI విశ్లేషణ చేపట్టి రీసెర్చి రిపోర్ట్ పేరిట వెల్లడించింది. 2012-23 మధ్య ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసినవారిలో 25 శాతం మంది అల్పాదాయ స్థాయిని దాటి పురోగమించారని చెప్పింది. 2022లో 7.3 కోట్ల IT రిటర్న్ లు రాగా.. 2023లో అది 7.8 కోట్లకు చేరుకుందని తెలిపింది. గడువు తేదీ తర్వాత దాఖలైన రిటర్న్స్ ల వాటా 60% నుంచి 24 శాతానికి తగ్గింది. జీరో టాక్స్ ఎబిలిటీని దాఖలు చేసే వారిలో గణనీయమైన తగ్గుదల ఉందని SBI రీసెర్చి రిపోర్ట్ అంచనా వేసింది.
దాఖలైన మొత్తం రిటర్న్స్ లో 2012లో 84.1 శాతంగా ఉన్న వారి వార్షిక వాటా 2023కు 64 శాతానికి చేరుకుంది. పన్నుల దాఖలుకు సంబంధించి రాష్ట్రాల వారీ పనితీరును విశ్లేషించింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ITRల సంఖ్య విషయానికి వస్తే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ వరుస ప్లేస్ ల్లో నిలిచాయి. 2022 కంటే 2023లో మొత్తం 64 లక్షల ITRలు ఫైల్ అయ్యాయని, అందులోనూ మహారాష్ట్రలో అత్యధికంగా రాగా.. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ లో గరిష్ఠ పెరుగుదల నమోదైంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 1400 మిలియన్లు(140 కోట్లుగా)గా ఉన్న ఇండియా పాపులేషన్ 2047 నాటికి 1610 మిలియన్లు(161 కోట్లకు) చేరుకుంటుందని SBI రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. తద్వారా శ్రామిక శక్తి 53 కోట్ల నుంచి 72.5 కోట్లకు చేరుకోనుందట. ప్రస్తుతం మొత్తం జనాభాలో శ్రామిక శక్తి వాటా 37.9 శాతం కాగా.. ఇది 2047 నాటికి 45 శాతానికి పెరుగుతుంది. పన్ను పరిధిలోకి వచ్చే శ్రామిక శక్తి వాటా ఈ ఇయర్ లో 31.3 కోట్లు ఉండగా.. అది 47 నాటికి 56.5 కోట్లకు చేరుకుంటుందని, దీని శాతం 59.1 నుంచి 78 శాతానికి పెరుగుతుందని SBI రీసెర్చ్ రిపోర్ట్ స్పష్టం చేసింది.