ఆమె అధికార పార్టీ ఎమ్మెల్యే… పార్టీ నుంచి బయటకు రాకముందే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అప్లయ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం టికెట్ ను… MLA అజ్మీరా రేఖానాయక్ కు బదులు రాథోడ్ జాన్సన్ నాయక్ కు ప్రకటించారు. నిన్న కేసీఆర్ వెల్లడించిన లిస్టులో రేఖా నాయక్ పేరు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ఆమె దృష్టి పెట్టారు. ఖానాపూర్ సెగ్మెంట్ మారుతుందని ముందునుంచీ ప్రచారం జరగడంతో రేఖానాయక్ తోపాటు ఆమె భర్త సైతం కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె భర్త.. హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక BRS టికెట్ దక్కకపోవడంపై అసంతృప్తి, ఆవేదనతో ఉన్న రేఖానాయక్.. ఇవాళ పొద్దున స్థానిక నాయకులు, కార్యకర్తలు తన అనుచరుల వద్ద ఆవేదన చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె పార్టీ మారతారు అన్న ప్రచారం జోరుగా నడుస్తోంది.
అయితే పార్టీ మారడానికన్నా ముందుగానే, BRSకు రాజీనామా చేయకుండానే నేరుగా కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఖానాపూర్ టికెట్ కోసం వేసిన అప్లికేషన్ ను రేఖానాయక్ PA… గాంధీభవన్ లో అందజేశారు. దీంతో అవకాశం దక్కితే ఆమె కాంగ్రెస్ క్యాండిడేట్ గా బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే ఆసిఫాబాద్ టికెట్ కోసం శ్యామ్ నాయక్ అప్లయ్ చేసుకున్నారు. ఇలా పక్క పక్క నియోజకవర్గాల నుంచే భార్యభర్తలు పోటీకి అప్లికేషన్ పెట్టుకోవడం ఆశ్చర్యకరంగా మారింది.
రిటైర్డ్.కలెక్టర్ శ్రీ.లౌడ్య. శర్మన్ గారు వున్నారు