పుతిన్ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన యెవ్ గెనీ ప్రిగోజిన్ దుర్మరణం పాలయ్యారు. విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. బిజినెస్ జెట్ లో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగి మొత్తం 10 మంది మృతిచెందారు. ఇన్సిడెంట్ బారిన పడిన ఫ్లైట్ లో ముగ్గురు పైలెట్లు, ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు రష్యన్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. పుతిన్ నాయకత్వాన్ని కూలదోసేందుకు ప్రిగోజిన్.. గత మే నెలలో తిరుగుబాటుకు యత్నించారు. ఉక్రెయిన్ వార్ లో అనాలోచితంగా వ్యవహరిస్తూ సైనికుల ప్రాణాలు తీస్తున్నారంటూ వ్లాదిమిర్ పుతిన్ పై మండిపడ్డారు. ఇది జరిగిన కొద్ది రోజులకు ఆయన పుతిన్ తో రాజీకి వచ్చారు. క్రెమ్లిన్ నాయకత్వం నుంచి వచ్చిన మెసేజ్ తో జూన్ 23, 24 తేదీల్లో పుతిన్ తో భేటీ అయ్యారు. ఈ చర్చల అనంతరం 24 గంటల్లోనే తిరుగుబాటును విరమిస్తున్నట్లు ప్రకటించి ప్రిగోజిన్ అదృశ్యమయ్యారు.
రష్యాలో ఉండటం ఇష్టం లేకుంటే ఆయన పోలండ్ వెళ్లొచ్చని పుతిన్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అప్పట్నుంచి ప్రిగోజిన్ మళ్లీ బయట కనిపించలేదు. ఇక ఈ తిరుగుబాటు తర్వాత ప్రిగోజిన్ కు ప్రాణ హాని ఉంటుందని అమెరికా అనుమానం వ్యక్తం చేసింది. బిల్డింగ్ కిటికీల వద్ద ప్రిగోజిన్ జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. గతంలో పుతిన్ కు వ్యతిరేకంగా గళమెత్తిన రష్యన్ వాసులు.. వివిధ దేశాల్లో సంచరిస్తున్న వేళ హోటల్ బిల్డింగ్స్ పై నుంచి పడి ప్రాణాలు కోల్పోయారు. ఇదే పరిస్థితి ప్రిగోజిన్ కు కూడా ఎదురుకావొచ్చని అందుకే అతను జాగ్రత్తగా ఉండాలని అమెరికా సూచించింది.