కాంగ్రెస్ తరఫున పోటీకి దిగేవారు(Aspirants) అందజేసే అప్లికేషన్లకు నేటితో గడువు తీరిపోనుంది. ఇప్పటివరకు 550 అప్లికేషన్లు వచ్చినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 25(నేటి)తో తుది గడువు పూర్తవుతుండగా.. పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు గురువారం నాడు పెద్ద సంఖ్యలో వచ్చిన ఆశావహులు.. అర్జీలు పెట్టుకున్నారు. మద్దతుదారులు, అనుచరులతో గాంధీభవన్ కు వచ్చి టికెట్ కోసం డిపాజిట్ చెల్లించి అప్లికేషన్ అందజేశారు.
రేపు ఒక్కరోజులోనే 100 నుంచి 200 వరకు అప్లికేషన్లు(Applications) వచ్చే అవకాశముందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరోవైపు టికెట్ల కోసం ముఖ్య నేతలు సైతం దరఖాస్తులు అందజేశారు.