జాబిల్లిపైకి చంద్రయాన్-3ని పంపి జాతి కీర్తిని ప్రపంచానికి చాటిన ఇస్రో(ISRO)కు ఇచ్చిన మాట మేరకు ప్రధానమంత్రి.. ఈరోజు సైంటిస్టులను కలుసుకోనున్నారు. వారితో ప్రత్యేకంగా ముచ్చటించి మరింత నైతిక స్థైర్యాన్ని ఇవ్వనున్నారు. ఈనెల 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ అడుగుపెట్టిన వైనం ప్రపంచం మొత్తం ఉద్విగ్నతతో తిలకించగా.. ప్రధాని మోదీ సైతం దక్షిణాఫ్రికా నుంచే ప్రోగ్రాంను సాంతం వీక్షించారు. బ్రిక్స్ సదస్సు కోసం ప్రధాని అక్కడకు వెళ్లిన సంగతి తెలిసిందే. చంద్రుడిపై అడుగు పెట్టిన వెంటనే మన కీర్తిని పొగిడిన ఆయన.. రెండు రోజుల్లో బెంగళూరు వచ్చి కలుసుకుంటానని ISRO ఛైర్మన్ సోమ్ నాథ్ కు మాట ఇచ్చారు. అందులో భాగంగానే ప్రధాని బెంగళూరు చేరుకుంటారు. బ్రిక్స్ సదస్సు ముగియగానే ఆయన బెంగళూరు వస్తున్నారు.
సుమారు వెయ్యి మంది శాస్త్రవేత్తలు ఇస్రోలో పనిచేస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే వారందరినీ మోదీ కలుసుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈయన రాకతో ఇస్రో సైంటిస్టుల్లో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదని చెప్పాలి.