ఈ వారం సినీప్రియుల్ని ఆకర్షించేందుకు మూవీలు OTTలోకి వస్తున్నాయి. వాటి వివరాలు…
కిసీ కా భాయ్ కిసీ కి జాన్ – ‘Zee5’…
సల్మాన్ ఖాన్, వెంకటేష్, జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రం ఈ శుక్రవారం (జూన్ 23) నుంచి Zee5లో ప్రీమియర్‌గా స్ట్రీమింగ్ అవుతుంది.
ఏజెంట్ – ‘సోనీ లివ్’…
అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ చిత్రం శుక్రవారం(జూన్ 23) నుంచి సోనీ లివ్‌లో ప్రీమియర్ కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
కేరళ క్రైమ్ ఫైల్స్ – ‘డిస్నీ+ హాట్‌స్టార్’…
ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటైన ‘కేరళ క్రైమ్ ఫైల్స్’ జూన్ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో వస్తుంది.
ఇంటింటి రామాయణం – ‘ఆహా’…
ఆదిపురుష్ మూవీ రిలీజ్ నాడే వచ్చిన ఇంటింటి రామాయణం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ఈ సినిమా నిర్మాతలు OTT కంటెంట్ ను నమ్ముకున్నారు. ఈ సినిమా జూన్ 23న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
టీకూ వెడ్స్ షేరు – ‘అమెజాన్ ప్రైమ్’…
హీరోయిన్ కంగనా రనౌత్ ఫస్ట్ టైమ్ నిర్మాతగా మారి తీసిన చిత్రం ‘టీకూ వెడ్స్ షేరు’. సాయి కబీర్ శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నేరుగా OTTలో విడుదల అవుతుండటం విశేషం. అమెజాన్ ప్రైమ్ లో ఈ జూన్ 23 నుంచి అందుబాటులో ఉంటుంది.
మళ్లీ పెళ్లి – ఆహా
సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు డైరెక్షన్లో నరేశ్, పవిత్ర లోకేశ్ జంటగా నటించిన మూవీ… ‘మళ్లీ పెళ్లి’. నిజ జీవిత కథను ఆధారంగా చేసుకుని తీసిన ఈ సినిమా ఈనెల 23న OTT ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతుంది.